కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ హైకోర్ట్ (Telangana High Court) మెగాస్టార్ చిరంజీవి సినిమాకు బిగ్ షాక్ ఇచ్చింది. ఆయన నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ (MSVPG) టికెట్ రేట్ల పెంపు ద్వారా వచ్చిన రూ. 42 కోట్లను రికవరీ చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సినిమా ప్రత్యేక షో టికెట్ ధర రూ.600, వారం రోజుల పాటు సింగిల్ స్క్రీన్స్‌లో రూ.50, మల్టీప్లెక్స్‌లో రూ.100 పెంచుతూ ఈ నెల 8న హోంశాఖ ముఖ్యకార్యదర్శి మెమో జారీ చేశారు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ మెమో జారీ చేసి రూ.42 కోట్లు అక్రమంగా ఆర్జించారని వాటిని రికవరీ చేయాలని న్యాయవాది పాదూరి శ్రీనివాసరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
పెంచిన ధరల ద్వారా సమకూరిన అదనపు ఆదాయం దాదాపు రూ. 42 కోట్ల నుంచి రూ.45 కోట్ల వరకు ఉంటుందని ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు. వాటిని రికవరీ చేయాలని కోరారు. పిటిషన్ ను విచారించిన తెలంగాణ హైకోర్టు రూ.42 కోట్ల వసూళ్లపై వివరాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి, జీఎస్టీ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ, విచారణ వచ్చే నెల 3వ తేదీని హైకోర్టు (Telangana High Court) వాయిదా వేసింది.
Read Also: వాలెంటైన్స్ డేకి ‘మనసంతా నువ్వే..’
Follow Us On: Instagram


