ఛత్తీస్‌గఢ్(Chhattisgarh) రాష్ట్రంలో తాజాగా పెను ప్రమాదం తప్పింది. గురువారం ఉదయం బిలాస్‌పుర్ జిల్లాలో ఒకే ట్రాక్‌పై మూడు రైళ్లు వచ్చాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇటీవలే ఇదే రాష్ట్రంలోని కొరబా రైల్వే సెక్షన్‌లో గూడ్స్ రైలు, ప్యాసింజర్ రైలును ఢీకొన్న ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
బిలాస్‌పుర్ రైల్వే డివిజన్‌లోని నిర్దిష్ట మార్గంలో మూడు రైళ్లు వరుసగా ఒకే ట్రాక్‌పై నిలిచిపోయినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీంతో ప్రయాణికులు రైళ్ల నుంచి కిందకు దిగారు. కొంతమంది వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
రైల్వే అధికారులు ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు. సిగ్నల్ లేదా ట్రాక్ మార్పిడి లోపం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందా? అనే దానిపై సమగ్రంగా పరిశీలిస్తున్నారు. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రమాదం జరగలేదు. మూడు రైళ్లు కూడా సకాలంలో ఆపి పెద్ద ప్రమాదాన్ని తప్పించగలిగారని అధికారులు వెల్లడించారు. ఇటీవల రైల్వే భద్రతపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన రైల్వే శాఖ అప్రమత్తతను పరీక్షిస్తున్నట్టు మారింది. ప్రయాణికులు భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకూడదని, సిగ్నల్ వ్యవస్థను మరింత కచ్చితంగా పర్యవేక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
Read Also: రాహుల్ ఆరోపణలపై స్పందించిన బ్రెజిల్ మోడల్
Follow Us on: Instagram

