ఆపరేషన్ సిందూర్ అనంతరం జరిగిన భారత్, పాక్ యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు Trump ఏ స్థాయిలో జోక్యం చేసుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రెండు దేశాల మధ్య యుద్ధాన్ని తానే ఆపానని ఇప్పటికే అనేక సార్లు క్లెయిమ్ చేసుకున్నారు. భారత్.. ఆయన ప్రకటనలను ఎన్నిసార్లు ఖండించినా పాత పాటే పాడుతున్నారు. అసలు యుద్ధం ఎవరు ఆపారో.. అక్కడే ఏం జరిగింతో ఓ మిస్టరీగానే ఉంది. పాకిస్థాన్ వేడుకోవడంతో తామే కాల్పుల విరమణకు అంగీకరించామని భారత్ చెబుతోంది. ఇందులో ట్రంప్( Trump) ప్రమేయం ఏమీ లేదని తేల్చి చెబుతోంది. అయితే ట్రంప్ మాత్రం తాను వాణిజ్య ఒప్పందం రద్దు చేసుకుంటానని ఇరు దేశాలను బెదిరించడంతోనే యుద్ధం ఆగిందని చెప్పుకున్నారు. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణకు ఒప్పందం కుదిరిందంటూ మొదట ప్రపంచానికి వెల్లడించింది ట్రంప్ కావడం గమనార్హం. ఇదిలా ఉంటే ఈయుద్ధానికి సంబంధించి ట్రంప్ తాజాగా మరో కామెంట్ చేశారు. ఈ యుద్ధంలో కూలిపోయింది ఏడు జెట్లు కాదు ఎనిమిది జెట్ విమానాలు అంటూ ఆయన పేర్కొన్నారు. మరి ఆ విమానాలు ఏ దేశానికి చెందినవో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఇక ట్రంప్ ఇటీవల తాను ప్రపంచంలోనే అతిపెద్ద శాంతి కాముకుడినని చెప్పుకొనే ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఎక్కడికి వెళ్లినా యుద్ధాలకు సంబంధించి మాట్లాడుతున్నారు.
తాజాగా మియామిలో జరిగిన అమెరికా బిజినెస్ ఫోరంలో మాట్లాడుతూ, “నా అధ్యక్షత కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది యుద్ధాలను ఆపగలిగాను. వాటిలో భారత్–పాక్ మధ్య జరిగిన సైనిక ఘర్షణ కూడా ఒకటి,” అని తెలిపారు. ఇటీవలి కాలంలో అమెరికాలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. ట్రంప్ “ప్రపంచానికి శాంతిని తెచ్చిన నాయకుడిగా” తనను ప్రదర్శించుకోవడం ఆయన రాజకీయ వ్యూహంలో భాగమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. భారత్–పాక్ మధ్య వివాదాలు సున్నితమైనవే. అమెరికా అధికారికంగా ఎప్పుడూ “ఇది ఇరుదేశాల ద్వైపాక్షిక విషయం” అనే వైఖరినే తీసుకుంది. కానీ ట్రంప్ అధ్యక్షత కాలంలో మాత్రం ఆయన పలు మార్లు “మధ్యవర్తిత్వం చేస్తానని” చెప్పిన విషయం తెలిసిందే. దానిని భారత్ ఎప్పటికప్పుడు ఖండించింది. అయినప్పటికీ ట్రంప్ ధోరణిలో ఎటువంటి మార్పు కనిపించడం లేదు.
Read Also: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. నలుగురు మావోయిస్టుల హతం
Follow Us on: Youtube

