కలం, నిజామాబాద్ బ్యూరో: మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) నేపథ్యంలో కాంగ్రెస్ మంత్రులు దూకుడు పెంచుతున్నారు. నిజామాబాద్ జిల్లా ఎన్నికల ఇన్చార్జి మంత్రిగా బాధ్యతలు తీసుకున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) రంగంలోకి దిగారు. గురువారం గాంధీభవన్లో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ సమక్షంలో నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని నిజామాబాద్ జిల్లాతో పాటు జగిత్యాల కోరుట్ల ముఖ్య నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నిజామాబాద్ నగరపాలక సంస్థ సహా ఇతర అన్ని మున్సిపాలిటీలను క్లీన్ స్వీప్ చేయాలని పార్టీ నాయకులకు సూచించారు.
బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టాలని ఉత్తమ్ (Uttam Kumar Reddy) సూచించారు. బీజేపీ ఎప్పటిలాగే మతం పేరిట రాజకీయం చేయాలని చూస్తోందన్నారు. మున్సిపల్ ఎన్నికలను ఆషామాషీగా తీసుకోద్దని, ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేయాలన్నారు. నేతలందరూ పూర్తి సమన్వయంతో కష్టపడి పనిచేయాలని ఉత్తమ్ సూచించారు. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని, ఇదే ఊపుతో అన్ని మున్సిపాలిటీలను గెలుచుకోవాలని దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ, మాజీ మంత్రులు జీవన్ రెడ్డి, మండవ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
Read Also: హుస్నాబాద్ ను టచ్ చేస్తే ఉద్యమమే : మాజీ ఎమ్మెల్యే
Follow Us On: X(Twitter)


