కలం, మెదక్ బ్యూరో : కాంగ్రెస్ మోసపూరిత పాలనను ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Elections) ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) ధీమా వ్యక్తం చేశారు. గురువారం హైదరాబాద్‌లోని హరీశ్ రావు నివాసంలో సంగారెడ్డి, నర్సాపూర్, పటాన్‌చెరు నియోజకవర్గాలకు చెందిన పలువురు కీలక నాయకులు భారీ సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ, ప్రభుత్వ వైఫల్యాలను ఇంటింటికి తీసుకెళ్లి ప్రజలను చైతన్యపరచాలని కార్యకర్తలు, నాయకులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా మున్సిపాలిటీలను నిర్వీర్యం చేస్తోందని, అభివృద్ధిని గాలికి వదిలేసిందని.. పట్టణాల్లో అనేక సమస్యలు ఉన్న కనీసం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, అమలు కాని హామీలపై విసిగిపోయి పలువురు నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారని హరీశ్ రావు (Harish Rao) తెలిపారు.
Read Also: నిజామాబాద్ మున్సి‘పోల్స్’పై ఉత్తమ్ ఫోకస్.. నేతలకు కీలక ఆదేశాలు
Follow Us On: Sharechat


