నటుడు అడివి శేష్(Adivi Sesh) తాజాగా మీడియాలో వస్తున్న వార్తలపై కాస్త అహసనం వ్యక్తం చేశారు. బాక్సాఫీస్ వార్ అంటూ మీడియా చేసే హడావుడి సరికాదని ఆయన పేర్కొన్నారు. ఆ పదం మీడియా సృష్టించిందేనని చెప్పారు. ఏ రెండు సినిమాల మధ్య వార్ ఉండదని.. బాగున్న సినిమాలను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని చెప్పారు. ఓ మీడియా చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు ఆయన కామెంట్లు చేశారు. “బాక్సాఫీస్ వార్” అనేది మీడియా తయారు చేసిన పదమని వ్యాఖ్యానించారు. ఆయన హీరోగా నటించిన ‘డెకాయిట్(Dacoit)’ మార్చి 19న విడుదల కానుంది. అదే తేదీకి యశ్ నటించిన ‘టాక్సిక్(Toxic)’ కూడా రిలీజ్ అవుతోంది. దీంతో ఈ రెండు సినిమాల మధ్య బాక్సాఫీస్ పోటీ తప్పదని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
‘టాక్సిక్ సినిమాతో మాకు ఎలాంటి భయం లేదు. నేను ఎప్పుడూ సైలెంట్‌గా వచ్చి హిట్‌ను అందుకుంటాను. ప్రేక్షకులు ఊహించని రీతిలో వారిని సర్ప్రైజ్ చేయడం నా శైలి. ఒకేసారి రెండు సినిమాలు రిలీజ్ అయ్యి సక్సెస్ సాధించిన ఉదాహరణలు చాలానే ఉన్నాయి. ఉదాహరణకు 2018లో యశ్(Yash) కేజీఎఫ్ మరియు షారుక్ జీరో ఒకేసారి విడుదలయ్యాయి. రెండూ విజయవంతమయ్యాయి. ఈసారి కూడా అదే జరుగుతుందని నమ్ముతున్నాను” అన్నారు.
“రెండు సినిమాలు ఒకే రోజున రిలీజ్ అవుతే వాటిలో ఒకటి ఫ్లాప్ అవుతుందనడం పూర్తిగా తప్పు. ప్రేక్షకులే తుది తీర్పు ఇస్తారు. లగాన్, గదర్ సినిమాలు ఒకేసారి విడుదలై బ్లాక్‌బస్టర్‌లుగా నిలిచాయి. బాక్సాఫీస్ వార్ అనేది మీడియా సృష్టించిన పదమే తప్ప ప్రేక్షకులు దానిని పట్టించుకోరు. కథ బాగుంటే వాళ్లు తప్పక థియేటర్లకు వస్తారు. ఆ వారాంతం పండుగ సమయమైతే మరింత హంగామా ఉంటుంది” అని అడివి శేష్(Adivi Sesh) అన్నారు.
Read Also: లేడీస్ హాస్టల్‌లో స్పై కెమెరాలు.. రోడ్డెక్కిన 2 వేల మంది మహిళలు
Follow Us on: Instagram

