కలం, వెబ్ డెస్క్ : జమ్మూ కాశ్మీర్ లోని దోడా జిల్లాలో ఆర్మీ వెహికల్ (Army vehicle) కు ప్రమాదం జరిగింది. గురువారం 17 మంది ఆర్మీ సిబ్బందితో భదేర్వాహ్-చంబా రోడ్డులో వెళ్తున్న వెహికల్ (Army vehicle) కంట్రోల్ తప్పి ఖన్నీ పర్వత ప్రాంతం దగ్గర లోయలో పడిపోయింది. దాదాపు 200 అడుగుల లోయలో పడటం వల్ల ఈ ప్రమాదంలో 10 మంది సైనికులు అక్కడికక్కడే చనిపోగా.. ఏడుగురు గాయపడ్డారు. ఈ విషయాన్ని ఆర్మీ ఉన్నతాధికారులు కన్ఫర్మ్ చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆర్మీ సిబ్బంది రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. గాయపడ్డవారిని ఉధంపూర్ మిలిటరీ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. గాయపడ్డ వారిలో కొందరి పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు దోడా జిల్లా కలెక్టర్ హర్వీందర్ సింగ్ తెలిపారు. మెరుగైన చికిత్స గురించి ఆస్పత్రి ఇన్చార్జి మేజర్ జనరల్ డాక్టర్ సంజయ్ శర్మతో మాట్లాడారు. వీలైనంత తొందరగా కోలుకునేలా ఉత్తమ చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్ శర్మ వివరించారు.


