epaper
Thursday, January 22, 2026
spot_img
epaper

పిల్లల చదువు కోసం బెస్ట్ స్కీమ్ ఇదే..

కలం, వెబ్ డెస్క్ : ఈ రోజుల్లో పిల్లల భవిష్యత్తును ఫైనాన్షియల్ గా ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ప్లాన్ చేయాల్సిందే. లేదంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మరీ ముఖ్యంగా పెరుగుతున్న స్కూల్ ఫీజులతో పాటు.. పీజీ లేదా ఎంబీఏ, బీటెక్, ఎంబీబీఎస్ లాంటి వాటి ఖర్చులను భరించాలంటే అందుకు తగ్గట్టు పర్ ఫెక్ట్ ప్లానింగ్ ఉండాల్సిందే. ఇలా పిల్లల చదువుల కోసం ప్లాన్ చేసే వారి కోసం ప్రభుత్వం కొత్తగా ఒక స్కీమ్ తెచ్చింది. అదే ఎన్ పీఎస్ వాత్సల్య స్కీమ్ (NPS Vatsalya). ఈ స్కీమ్ ను కేంద్ర ప్రభుత్వం 2024లో తీసుకొచ్చింది. ఇది నేషనల్ పెన్షన్ సిస్టమ్ పరిధిలోనే పనిచేస్తుంది.

విత్ డ్రా ఎప్పుడు చేయొచ్చు..?

మీ పిల్లలు పుట్టినప్పటి నుంచి 18 ఏళ్ల లోపు ఎప్పుడైనా ఈ వాత్సల్య (NPS Vatsalya) స్కీమ్ కింద ఖాతా తెరవొచ్చు. ఇందులో నెలకు రూ.500 నుంచి ఎంతైనా పెట్టుబడి పెట్టొచ్చు. పిల్లలకు 18 ఏళ్లు వచ్చాక ఈ ఖాతా ఎన్ పీఎస్ ఖాతాగా మారుతుంది. మీరు ఖాతా తెరిచినప్పటి నుంచి మూడేళ్లు పూర్తయిన తర్వాత ఈ ఎన్ పీఎస్ స్కీమ్ నుంచి 25 శాతం దాకా విత్ డ్రా చేసుకోవచ్చు. మీ పిల్లలకు 18 ఏళ్లు వచ్చిన తర్వాత ఉన్న మొత్తంలో 80 శాతం దాకా విత్ డ్రా చేసుకోవచ్చు. ఈ లిమిట్ ను 18 ఏళ్ల నుంచి 21 ఏళ్ల మధ్యలో రెండుసార్లు విత్ డ్రా చేయొచ్చు. ఈ డబ్బును విద్య లేదా వైద్యం ఖర్చులకు డ్రా చేయాలి అనేది ప్రభుత్వ రూల్. ఒకవేళ 60 ఏళ్లు వచ్చేదాకా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే చేయొచ్చు. అప్పుడు రాబడి కూడా భారీగా ఉంటుంది.

రాబడి ఎంత..?

ఈ స్కీమ్ లో మీ పెట్టుబడి మీద 14 శాతం రాబడి ఉంటుంది. ఉదాహరణకు మీరు నెలకు రూ.1000 చొప్పున 30 ఏళ్ల దాకా ఇన్వెస్ట్ చేస్తే మీ పిల్లల పేరు మీద రూ.62 లక్షలకు పైగా ఉంటాయి. ఈ మొత్తంలో మీరు 75 శాతం దాకా ఒకేసారి విత్ డ్రా చేసుకోవచ్చు. మిగిలిన మొత్తం పెన్షన్ ఫండ్ లో పెట్టాలి. అప్పుడు నెలకు రూ.12వేల చొప్పున పెన్షన్ రూపంలో మీ పిల్లలకు వస్తాయి.

ఖాతా ఎలా తెరవాలి..?

మీరు ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెడితే.. రాబడి కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఈ ఖాతా తెరవడం కోసం మీ పిల్లల డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ తో పాటు స్కూల్ టీసీ, పాన్ కార్డు, పేరెంట్స్ ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్ లాంటి వాటితో ఎన్ పీఎస్ వెబ్ సైట్ లో లేదా ఏదైనా బ్యాంకులో ఈ ఖాతాలను తెరవొచ్చు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>