కలం, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రం నుంచి ఓ పెద్ద పులి (Tiger) ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లాలోకి (Eluru District) ప్రవేశించింది. దీంతో ఏలూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రస్తుతం జిల్లాలోని పందిరిమామిడిగూడెంలో పులి సంచరిస్తున్నట్లు సమాచారం. ఇటీవల ఖమ్మం జిల్లాలోని కావడిగుడ్లలో ఇదే పులి లేగదూడపై దాడి చేసి చంపేసింది. కావడిగుడ్ల నుంచే పందిరిమామిడిగూడెంలోకి పులి ప్రవేశించింది. పులి సంచరిస్తున్న వార్తలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళకు గురవుతున్నారు. రైతులు పొలాలకు వెళ్లేందుకు భయపడుతున్నారు. పందిరిమామిడిగూడెం, ఇనుమూరు, గాడిదబోరు, అంతర్వేదిగూడెం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఆయా గ్రామాల్లో అధికారులు ట్రాప్ కెమెరాలతో పాటు గస్తీ ఏర్పాటు చేశారు. పులి సంచరించిన ఆనవాళ్లు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని గ్రామస్తులకు సూచించారు.
Read Also: పసుపు పాలు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే
Follow Us On: Instagram


