epaper
Thursday, January 22, 2026
spot_img
epaper

సీరియల్​లా సాగుతున్న సిట్​ విచారణ: ఎంపీ రఘునందన్​ రావు

కలం, మెదక్​ బ్యూరో: రాష్ట్రంలో ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారంపై సిట్​ విచారణ సీరియల్​లా సాగుతోందని మెదక్​ ఎంపీ రఘునందన్​ రావు (Raghunandan Rao) అన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఫోన్​ ట్యాపింగ్​ కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం సీరియస్​గా తీసుకున్నట్లు అనిపించడం లేదన్నారు. బీఆర్​ఎస్​ పార్టీ నాయకులు కాంగ్రెస్​లో.. కాంగ్రెస్​ నాయకులు బీఆర్​ఎస్​లో సిట్​ అవుతున్నారు తప్ప, ఫోన్​ ట్యాపింగ్​పై సిట్​ విచారణలో మాత్రం ఎలాంటి పురోగతీ కనిపించడం లేదని ఎంపీ అన్నారు.

ఫోన్​ ట్యాపింగ్​ కేసును సిట్​ సీరియస్​గా తీసుకొని త్వరగా విచారణ పూర్తి చేసి, దోషులను జైలుకు పంపాలని ఎంపీ రఘునందన్​ రావు (Raghunandan Rao) అన్నారు. సీపీ సజ్జనార్​కు ఉన్న మంచి పేరు నిలబెట్టుకోవాలంటే, దర్యాప్తును వేగంగా పూర్తి చేసి, నేరస్థులను కోర్టు ముందు నిలబెట్టాలని ఆయన సూచించారు. సిట్​ 1, సిట్​ 2 అంటూ మున్సిపల్​ ఎన్నికల అనంతరం సిట్​ 3 అని వాయిదా వేయకుండా కేసు త్వరగా తేల్చాలని ఎంపీ కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>