కలం, వెబ్ డెస్క్ : నాగ్ పూర్ వేదికగా న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి టీ20లో( Ind vs NZ T20) టీమిండియా (Team India) వీరబాదుడు బాదింది. టాస్ గెలిచి కివీస్ ఫీల్డింగ్ ఎంచుకోగా.. భారత ఆటగాళ్లు సంజు శామ్సన్ (10), ఇషాన్ కిషన్ (8) రన్స్ కు ఔటయ్యారు. అభిషేక్ శర్మ (Abhishek Sharma) దూకుడు మీద ఆడాడు. 35 బంతుల్లో 8 సిక్స్ లు, 5 ఫోర్లు కొట్టాడు. 84 రన్స్ చేసి వెనుదిరిగాడు. అంతకు ముందు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 22 బంతులకు 32 రన్స్ చేసి ఔటయ్యాడు. శివం దుబే 9కే వెనుదిరిగాడు. 15 ఓవర్లకు టీమిండియా 5 వికెట్ల నష్టానికి 182 రన్స్ చేసింది. హార్దిక్ పాండ్యా 25, అక్షర్ పటేల్ 5 పరుగులు తీసి ఔటయ్యారు. రింకూ సింగ్ (Rinku Singh) 20 బాల్స్ లో 3 సిక్స్, 4 ఫోర్లతో 44 రన్స్ చేశాడు. మొత్తం 20 వర్లలో 7 వికెట్ల నష్టానికి టీమిండియా 238 రన్స్ చేసింది. కివీస్ టార్గెట్ 239.

Read Also: బంగ్లాదేశ్, ఐసీసీ మధ్య వివాదం.. దానిపై మాట్లాడనంటున్న బంగ్లా కెప్టెన్
Follow Us On: Youtube


