కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) టాటా చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్‌తో (Natarajan Chandrasekaran) కీలక భేటీలో పాల్గొన్నారు. విజన్ –2047 లక్ష్యాల కింద రాష్ట్ర అభివృద్ధికి అనుకూలంగా పెట్టుబడుల విధానాలను వివరించారు. హైదరాబాద్‌లోని స్టేడియాల అభివృద్ధికి టాటా గ్రూప్ సహకారం కోరారు. టాటా ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ ఆ స్టేడియాల అప్‌గ్రేడేషన్‌కు సిద్ధమని తెలిపారు.
అలాగే, మూసీ నది పునరుజ్జీవనం (Musi Rejuvenation), రాష్ట్రంలో కొత్త హోటళ్లు, రిసార్ట్స్, కొత్త మానుఫాక్చరింగ్ యూనిట్ల ఏర్పాటుపై టాటా ఆసక్తి చూపారని సీఎం తెలిపారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో ఈ భాగస్వామ్యాలు కీలకంగా ఉంటాయని ఆయన అన్నారు.
Read Also: రాష్ట్రంలో స్టీల్ ప్లాంట్ .. పెట్టుబడికి రష్మి గ్రూప్ ఎంవోయూ
Follow Us On: Youtube


