కలం, వెబ్ డెస్క్: వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ (YS Jagan) కీలక ప్రకటన చేశారు. ఏడాదిన్నర తర్వాత తాను పాదయాత్ర చేయబోతున్నట్టు ప్రకటించారు. అప్పటివరకు తాను నియోజకవర్గాల్లో పర్యటిస్తానని చెప్పారు. బుధవారం జగన్ ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాదయాత్రకు (Padayatra) సంబంధించిన ప్రకటన చేశారు. ఇక నుంచి పూర్తి స్థాయిలో పార్టీ కోసం సమయం వెచ్చిస్తానని.. కార్యకర్తలతో ప్రతి వారం సమావేశాలు జరుపుతానని జగన్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇప్పుడు కేవలం రెండు బడ్జెట్లే మిగిలాయని చెప్పారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. ‘రెడ్బుక్తో ఏదైనా చేయొచ్చనే అహంకారంతో కూటమి ప్రభుత్వం ఉంది. ప్రశ్నిస్తే కేసులు పెట్టి వేధిస్తున్నారు. పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారు. అందుకే ప్రభుత్వంపై చాలా వ్యతిరేకత వచ్చింది. చంద్రబాబు మోసాలను ప్రజలు గుర్తించారు.. ‘సూపర్ సిక్స్ లేదు, సూపర్ సెవన్ లేదు, అన్నీ మోసాలే‘ అంటూ జగన్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇక జగన్ (YS Jagan) గతంలో పాదయాత్ర చేసి ఏకంగా 151 సీట్లు సాధించి అధికారాన్ని చేపట్టారు. అయితే 2024 ఎన్నికలలో వైసీపీ పార్టీ ఘోర ఓటమి చవిచూసింది. మరి ఈ సారి పాదయాత్ర చేస్తే ఆయనను జనం ఆదరిస్తారా? అన్నది వేచి చూడాలి.
Read Also: ‘నో వర్క్ – నో పే’.. : ఏపీ స్పీకర్ సంచలన ప్రతిపాదన
Follow Us On: Instagram


