epaper
Wednesday, January 21, 2026
spot_img
epaper

రాజకీయ ప్రయోగశాలగా మారిన సింగరేణి : కిషన్​ రెడ్డి

కలం, వెడ్​ డెస్క్​ : గతంలో బీఆర్​ఎస్,​ ఇప్పుడు కాంగ్రెస్ సింగరేణి (Singareni)ని విధ్వంసం చేస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి (Kishan Reddy) తీవ్ర ఆరోపణలు చేశారు. రాజకీయ ప్రయోగశాలగా సింగరేణిని మార్చారని ఆయన దుయ్యబట్టారు. బీఆర్​ఎస్​ ఎలా పనిచేసిందో కాంగ్రెస్​ అలానే పని చేస్తోందని విమర్శించారు.  నైనీ కోల్​ బ్లాక్ విషయంలో కేంద్రం సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. ఒడిశా రాష్ట్రంలో బీజేపీ వచ్చాక.. అక్కడి ప్రభుత్వంతో అనుమతులపై చర్చించామని చెప్పారు. నైనీ బొగ్గు గనులకు సంబంధించి చివరి అనుమతులు వచ్చినా పనులు ఎందుకు ఆలస్యం చేశారని కాంగ్రెస్​ ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. నైనీ బ్లాకు విషయంలో బీఆర్​ఎస్​ వ్యవహరించినట్లుగానే కాంగ్రెస్​ ప్రభుత్వం నడుస్తోందని కిషన్​ రెడ్డి విమర్శించారు.

Read Also: ‘సిట్’ ముందుకు కవిత?.. త్వరలో సమన్లు జారీ?

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>