epaper
Wednesday, January 21, 2026
spot_img
epaper

వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో మెగాస్టార్

కలం, వెబ్​ డెస్క్​ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో నిర్వహించిన World Economic Forum వార్షిక సదస్సు–2026లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ (Zurich) లో ఉన్నారని తెలుసుకున్న ముఖ్యమంత్రి ఆయన్ను సదస్సుకు ఆహ్వానించారు. ముఖ్యమంత్రి ఆహ్వానాన్ని గౌరవిస్తూ చిరంజీవి సదస్సుకు (Chiranjeevi) హాజరయ్యారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) వేదిక పై ఆవిష్కరించిన “తెలంగాణ రైజింగ్ 2047” విజన్ డాక్యుమెంట్‌ను ప్రత్యక్షంగా వీక్షించారు. అంతర్జాతీయ వేదిక పై తెలంగాణ అభివృద్ధి దృక్పథాన్ని ప్రతిబింబించిన ఈ ఘట్టం ప్రత్యేకంగా నిలిచింది.

తమ కుటుంబ సభ్యులతో పాటు మనవళ్లతో కలిసి “మన శంకరవరప్రసాద్ గారు” సినిమాను వీక్షించానని, సినిమాను ఎంతో ఆస్వాదించానని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సినిమా అందించిన వినోదం పట్ల ఆయన తన అభినందనలను వ్యక్తిగతంగా చిరంజీవితో పంచుకున్నారు. స్విట్జర్లాండ్‌లో అనుకోకుండా కలుసుకున్న ఈ సదస్సు సందర్భంగా స్నేహపూర్వకంగా కలిసి సమయాన్ని గడిపారు. చిరంజీవి (Chiranjeevi) కుటుంబంతో కలిసి వ్యక్తిగత విహారయాత్ర నిమిత్తం స్విట్జర్లాండ్‌కు వెళ్లిన సమయంలోనే ఈ ఆహ్లాదకరమైన సమావేశం అంతర్జాతీయ సదస్సులో పాల్గొనడం చోటు చేసుకుంది.

Read Also: రెహమాన్ గొప్ప కంపోజర్.. ఆర్జీవి ట్వీట్ వైరల్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>