epaper
Wednesday, January 21, 2026
spot_img
epaper

లిక్కర్ షాపులో సీపీఐ నేత నారాయణ హడావుడి

కలం, వెబ్ డెస్క్: సీపీఐ జాతీయ నేత నారాయణ (CPI Leader Narayana) ఖమ్మం జిల్లాలోని ఓ వైన్ షాప్‌లో కలియదిరుగుతూ హడావుడి చేశారు. ఒక్కో బాటిల్ ధర ఎంతని అడిగి తెలుసుకున్నారు. లిక్కర్ మార్ట్ లో ఎంత ధరకు విక్రయిస్తారు? వైన్ షాపులో ఎంత ధరకు విక్రయిస్తారు? బెల్ట్ షాపులో ఎంత ఎక్కువ ధరకు విక్రయిస్తారు? తదితర వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుత ప్రభుత్వాల లిక్కర్ ఆదాయం మీదే ఆధారపడుతున్నాయని విమర్శించారు.

గత ప్రభుత్వాల కంటే ప్రస్తుత ప్రభుత్వాలు ఇంకా ఎక్కువ మందుబాటిల్ విక్రయం ద్వారా ఎక్కువ ఆదాయం సాధించడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నాయని నారాయణ (CPI Leader Narayana) మండిపడ్డారు. ఊర్లల్లోని బెల్ట్ షాపులు స్థానికుల ఇష్టానుసారం నిర్వహించబడుతున్నా, వాటి నిర్వహణపై అధికారుల పక్కన చూడడం లేమని ఆయన అన్నారు. అలాగే, బెల్ట్ షాపుల్లో రూ. 25 నుంచి రూ. 50 వరకు అధిక ధరల్లో మందు విక్రయిస్తున్నారని నారాయణ ఆరోపించారు. బెల్ట్ షాపులను ప్రభుత్వం పరోక్షంగా ప్రోత్సహిస్తూ ప్రజల మీద అదనపు భారం మోపుతున్నదని ఆరోపించారు. ప్రభుత్వాలకు లిక్కర్ ఆదాయమే అత్యంత కీలకంగా మారిందని పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>