కలం, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా ఉన్న నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT)ల్లో ఇంజనీరింగ్ (బీటెక్), ఆర్కిటెక్చర్(బీఆర్క్), బి.ప్లానింగ్‌లో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (మెయిన్) పరీక్షలు (JEE Main 2026) రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 21, 22,23, 24, 28, 29 తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి. మొదటి ఐదు రోజులు పేపర్–1, 29వ తేదీన పేపర్–2 పరీక్ష ఉంటుంది. రోజూ ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12వరకు, తిరిగి మధ్యాహ్నం 3నుంచి 6గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఇప్పటికే పేపర్–1కు సంబంధించి అడ్మిట్ కార్డులు రిలీజయ్యాయి. పేపర్–2కు అడ్మిన్ కార్డులు త్వరలోనే రిలీజ్ చేస్తారు. పరీక్షలను తెలుగు, ఇంగ్లీష్‌తో పాటు మరో 13 భాషాల్లో నిర్వహిస్తారు. ఎగ్జామ్ సెంటర్స్ వివరాలు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఇది వరకే ప్రకటించింది.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు:
ఆంధ్రప్రదేశ్: అనంతపురం, భీమవరం, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, నరసరావుపేట, ప్రొద్దుటూరు, సూరంపాలెం, మచిలీపట్నం, మంగళగిరి, నంద్యాల, తాడేపల్లిగూడెం, ఆదోని, అమలాపురం, మదనపల్లె, మార్కాపురం, పుత్తూరు, రాయచోటి, తాడిపత్రి, తిరువూరు.
తెలంగాణ: కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్లగొండ, వరంగల్, నిజామాబాద్, సూర్యాపేట, సిద్ధిపేట, జగిత్యాల, కొత్తగూడెం, హైదరాబాద్, ఆదిలాబాద్, కోదాడ, పెద్దపల్లి.
తెలుసుకోవాల్సినవి:
- అభ్యర్థులు అడ్మిన్ కార్డు (JEE Main 2026) లోని పరీక్ష తేదీ, షిఫ్ట్, టైమింగ్స్, సెంటర్, పరీక్ష కేంద్రాల వద్ద రిపోర్ట్ చేయాల్సిన టైమ్, గేట్ క్లోజింగ్ గురించి ముందుగానే తెలుసుకోవాలి.
- అడ్మిన్ కార్డు ప్రింటవుట్ తీసుకొని.. దానిపై ఫొటో అతికించాలి. వేలిముద్ర వేయాలి. పాస్‌పోర్ట్ సైజు ఫొటో, రిజిస్ట్రేషన్‌కు ఇచ్చిన ఐడెంటిటీ కార్డు (ఆధార్ వంటివి) ఒరిజినల్ తీసుకెళ్లాలి.
- పరీక్ష కేంద్రానికి కాస్త ముందుగానే చేరుకోవాలి. ఉదయం షిఫ్ట్‌లో 7.30 నుంచి 8.30 గంటల మధ్య; మధ్యాహ్నం షిఫ్ట్‌కు 1.30 నుంచి 2.30గంటల మధ్య విద్యార్థులను అనుమతిస్తారు.
- రిజిస్ట్రేషన్‌కు ఆధార్ కాకుండా వేరే గుర్తింపు కార్డు ఉపయోగించినవాళ్లు పరీక్ష సెంటర్ గేటు మూయడానికి గంట ముందే ఎగ్జామ్ సెంటర్‌కు చేరుకోవాలి.
- పరీక్ష కేంద్రాల్లోకి జామెట్రీ/పెన్సిల్ బాక్స్, హ్యాండ్ బ్యాగ్, పర్స్తోపాటు ఎలాంటి పేపర్లూ అనుమతించరు. అలాగే ఆహార పదార్థాలు, మొబైల్, ఇయర్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకెళ్లకూడదు.పెద్ద బటన్స్ ఉండే దుస్తులు ధరించి వస్తే అనుమతించరు. డయాబెటిక్ విద్యార్థులు ట్యాబ్లెట్లు, మెడిసిన్ సంబంధిత ప్రూట్స్ తెచ్చుకోవచ్చు.
Read Also: బీఆర్ఎస్తో వైసీపీ.. కాంగ్రెస్‌తో టీడీపీ.. ఖమ్మంలో పొత్తులుంటాయా..?
Follow Us On: X(Twitter)


