అలనాటి బాలీవుడ్ అందాల తార, ట్రాజెడీ క్వీన్‌గా పేరుగాంచిన మీనా కుమారి జీవితంపై బయోపిక్ తెరకెక్కేందుకు సన్నాహాలు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ చిత్రానికి సిద్ధార్థ్ పి. మల్హోత్రా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం కథా రచన, ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి షూటింగ్ ప్రారంభించాలనే ఉద్దేశ్యంతో టీమ్ సిద్ధమవుతోంది. మీనా కుమారి పాత్రను ఎవరు పోషిస్తారనే అంశంపై చాలా కాలంగా సస్పెన్స్ నెలకొన్నది. మొదట కృతి సనన్, తర్వాత కియారా అద్వాణీ(Kiara Advani) పేర్లు వినిపించాయి. కానీ అధికారిక ప్రకటన లేకపోవడంతో గందరగోళం నెలకొంది. తాజాగా ఆ ఊహాగానాలకు తెరదింపుతూ కియారా అద్వాణీ స్వయంగా స్పందించారు. “కమల్ ఔర్ మీనా(Kamal Aur Meena)” పేరుతో రూపొందుతున్న ఈ బయోపిక్‌లో మీనా కుమారి పాత్రను తానే పోషిస్తున్నట్లు ఆమె ప్రకటించారు.
ఈ చిత్రంలో మీనా కుమారి(Meena Kumari) భర్త కమల్ అమ్రోహీ పాత్రను ఎవరు చేస్తారు అన్నది మాత్రం ఇంకా తేలలేదు. ఆ పాత్ర కోసం యువ నటులలో కొందరి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. పూర్తిస్థాయి నటీనటుల ఎంపిక అనంతరం వచ్చే ఏడాది ఆరంభంలో షూటింగ్ ప్రారంభించనున్నారు. మీనా కుమారి జీవితం అంటే ఒక భావోద్వేగ గాథే. తన నటనతో “సాహిబ్ బివీ ఔర్ గులాం”, “దిల్ ఏక్ మందిర్”, “ఫూల్ ఔర్ పత్తర్”, “పకీజా” వంటి క్లాసిక్ చిత్రాలను బాలీవుడ్‌కు అందించారు. తెరమీద సౌందర్యం, ప్రతిభతో మెరిసిన ఈ నటి వ్యక్తిగత జీవితంలో మాత్రం తీవ్ర విషాదానికి గురయ్యారు. ప్రేమలో నిరాశ, మద్యపానం వంటి కారణాలు ఆమె జీవితాన్ని నాశనం చేశాయి. సినిమా ప్రపంచంలో వెలుగులు నింపిన మీనా కుమారి వ్యక్తిగతంగా ఎదుర్కొన్న చీకటి కోణాన్ని చూపిస్తూ “కమల్ ఔర్ మీనా” సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.
Read Also: ఆస్కార్ అవార్డులపై పరేశ్ రావల్ సంచలన వ్యాఖ్యలు
Follow Us On : Instagram

