కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్ కార్పొరేషన్ తో పాటు జిల్లాలోని బోధన్, ఆర్మూర్ మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) బరిలోకి దిగాలని ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయించింది. నిజామాబాద్ లో జరిగిన ఆ పార్టీ సమావేశంలో ఆ పార్టీ జాతీయ ప్రతినిధి తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జ్ ప్రియాంక కక్కర్, పార్టీ మాజీ తెలంగాణ అధ్యక్షుడు బుర్ర రామగౌడ్ పాల్గొన్నారు.. ఈ సందర్భంగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు, బోధన్ ఆర్మూర్ మున్సిపాలిటీల్లో పోటీ చేస్తున్నట్లు పార్టీ నిర్ణయించినట్టు నేతలు ప్రకటించారు.
Municipal Elections | నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు సమీర్ అహ్మద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో మున్సిపల్ ఎన్నికల కార్యాచరణ అభ్యర్థుల ఎంపికపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అవినీతి రహిత పాలన, నాణ్యమైన ఉచిత విద్య మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ ప్రజల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తోందని నేతలు వెల్లడించారు. ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల తరహా అభివృద్ధిని నిజామాబాద్ జిల్లాలో సాకారం చేయడమే ప్రధాన ఎజెండా అని తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు ఆయా నియోజక వర్గాల ఇన్ చార్జ్ లకు సూచించారు.
Reas also : పసుపు రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలి: ఎంపీ అరవింద్
Follow Us On : Twitter


