కలం, వరంగల్ బ్యూరో : గత మేడారం జాతరలో (Medaram Jatara) సుమారు 30 వేల మంది వరకు తప్పిపోయిన చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అధికార యంత్రాంగం ఈసారి వొడాఫోన్-ఐడియా సహకారంతో ‘జియోట్యాగ్ బేస్డ్ మిస్సింగ్ పర్సన్స్ ట్రాకింగ్’ (Geotag Based Missing Persons Tracking System) వ్యవస్థను సిద్ధం చేసింది. పస్రా (Pasra), తాడ్వాయి (Tadwai) మార్గాల్లో ఏర్పాటు చేసిన కౌంటర్లలో వృద్ధులు, పిల్లల వివరాలను నమోదు చేసి వారి చేతికి క్యూఆర్ కోడ్ (QR Code) కలిగిన జియోట్యాగ్‌లను కడతారు.
ఒకవేళ ఎవరైనా తప్పిపోతే, ఈ ట్యాగ్‌ను స్కాన్ చేయడం ద్వారా వారి పూర్తి వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. శబరిమలలో విజయవంతమైన ఈ విధానాన్ని ఇప్పుడు మేడారం (Medaram Jatara)లో అమలు చేస్తున్నారు. ఈ విధానంలో తెలుగు, ఇంగ్లీష్‌తో పాటు హిందీ, తమిళ భాషల్లోనూ వివరాల నమోదుకు అవకాశం కల్పించారు.
Read Also : కోటిమంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దుతాం : మంత్రి కోమటిరెడ్డి
Follow Us On : Twitter


