కలం, వెబ్ డెస్క్ : బంగ్లాదేశ్ లో మైనార్టీ హిందువులపై జరుగుతున్న దాడులు మతపరమైనవి కావని తాత్కాళిక అధ్యక్షుడు మహమ్మద్ యూనస్ కార్యాలయం ప్రకటించింది. మైనార్టీలపై జరుగుతున్న దాడులన్నీ నేరపూరిత ఉద్దేశం కలిగిన వారే చేస్తున్నారని తెలిపింది. ఈ మేరకు యూనస్ ఆఫీస్ సోమవారం ఒక ప్రకటన రిలీజ్ చేసింది. బంగ్లాదేశ్ లో (Bangladesh) అల్లర్లు మొదలైనప్పటి నుంచి ఇప్పటి దాకా మైనార్టీలపై 645 దాడులు జరిగాయని.. అందులో 71 మాత్రమే మతపరమైన దాడులని.. మిగతావి నేరపూరితంగా జరిగాయని తెలిపింది యూనస్ కార్యాలయం. ఈ 71 దాడుల్లో 38 ఘటనలు ఆలయాలపై జరిగాయని.. 50 దాడుల్లో నిందితులను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసినట్టు స్పష్టం చేసింది యూనస్ టీమ్.
బంగ్లాదేశ్ లో (Bangladesh) జరిగే అన్ని నేరాలను తీవ్రంగా పరిగణిస్తున్నామని.. హింసను సహించేది లేదని యూనస్ ఆఫీస్ వెల్లడించింది. మైనార్టీలపై దాడుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నామని.. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. మైనార్టీలపై దాడులను కంట్రోల్ చేయాలంటూ ఇండియా ఒత్తిడి చేస్తున్న క్రమంలో బంగ్లాదేశ్ ఇలా స్పందించింది. ఇప్పటి వరకు బంగ్లాదేశ్ లో 13 మంది హిందువులు దాడుల్లో చనిపోయారు. రీసెంట్ గా పెట్రోల్ బంక్ లో ఓ హిందూ యువకుడిని కారుతో తొక్కించి చంపగా.. నిన్న అరటిపళ్ల దుకాణ యజమానిని కొట్టి చంపిన విషయం తెలిసిందే.
Read Also : మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలి: మొగలి సునీతా రావు
Follow Us On : Twitter


