కలం, ఖమ్మం బ్యూరో : ఫిబ్రవరి రెండవ వారంలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయనే సంకేతాలు వెలువడడంతో బీఆర్ఎస్ శ్రేణులు అలెర్ట్ అయ్యారు. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు జిల్లాలో 40 శాతానికి పైగా స్థానాలు వచ్చాయి. చాలా చోట్ల తక్కువ ఓట్లతో ఓడిపోయారు. కాబట్టి కొంచెం సీరియస్‌గా పనిచేస్తే కొత్తగూడెం కార్పొరేషన్‌ను (Kothagudem Corporation) కైవసం చేసుకోవచ్చు అనే దిశగా బీఆర్ఎస్ ప్రయత్నాలు మొదలు పెట్టింది.
అందులో భాగంగానే రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర (Vaddiraju RaviChandra) సోమవారం కొత్తగూడెం తెలంగాణ భవన్లో జిల్లా అధ్యక్షుడు రేగ కాంతారావు (Rega Kantharao), మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు (Vanama Venkateshwara Rao) లతో కలిసి కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రజలను ఎలా మోసం చేసిందో గడప గడపకు తిరిగి ప్రచారం చేయాలన్నారు. బాకీ కార్డు స్టిక్కర్లను, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన స్టిక్కర్లను విడుదల చేశారు. వీటిని ప్రతీ ఇంటికి అంటించి, ప్రతి ఓటర్‌తో మమేకమై కాంగ్రెస్ సర్కారు తప్పిదాలను వివరించాలని కార్యకర్తలకు తెలిపారు.
కొత్తగూడెం కార్పొరేషన్ (Kothagudem Corporation) ఎన్నికల్లో పోటీ చేయడానికి చాలా మంది యువత ముందుకు వస్తున్న నేపథ్యంలో, పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్న వారంతా జిల్లా ఆఫీసులో దరఖాస్తు చేసుకునే ఏర్పాటు చేశారు. దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, అవసరమైతే సర్వే చేయించి అభ్యర్ధులను ఖరారు చేయనున్నట్లు తెలుస్తుంది.
Read Also: మున్సి‘పోల్స్’కు కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీలు ఏర్పాటు
Follow Us On : WhatsApp


