కలం, వెబ్ డెస్క్ : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) అభిమానులకు, చిన్నస్వామి స్టేడియం (Chinnaswamy Stadium) కు కర్ణాటక ప్రభుత్వం శుభవార్త చెప్పింది. బెంగళూరులోని ప్రతిష్టాత్మక ఎం. చిన్నస్వామి స్టేడియానికి అంతర్జాతీయ మ్యాచ్‌లు, ఐపీఎల్ పోటీలు మళ్లీ నిర్వహించేందుకు అధికారిక అనుమతి లభించింది. ఈ విషయాన్ని కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం ప్రెస్ రిలీజ్ ద్వారా వెల్లడించింది. గత ఏడాది జూన్ 4న జరిగిన ట్రోఫీ వేడుకలో తొక్కిసలాట చోటు చేసుకోవడంతో 11 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఆ విషాద ఘటన తర్వాత స్టేడియంపై కఠిన ఆంక్షలు విధించారు. దాంతో విజయ్ హజారే ట్రోఫీ, మహిళల వరల్డ్ కప్ మాత్రమే కాదు, పురుషుల టీ20 వరల్డ్ కప్‌కు కూడా బెంగళూరు దూరమైంది. ప్రభుత్వం నిర్దేశించిన కఠిన నిబంధనలను పాటించిన పక్షంలోనే ఈ అనుమతి చెల్లుబాటు అవుతుందని KSCA స్పష్టం చేసింది. భద్రత, సెక్యూరిటీ, ప్రేక్షకుల నియంత్రణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి బాధ్యతతో అమలు చేస్తామని సంఘం భరోసా ఇచ్చింది.

Read Also: కొత్త మోడల్‌తో పీఎస్ఎల్ 11వ సీజన్ !
Follow Us On : WhatsApp


