epaper
Saturday, January 17, 2026
spot_img
epaper

ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఇక రచ్చరచ్చే!

కలం, వెబ్ డెస్క్ : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) అభిమానులకు, చిన్నస్వామి స్టేడియం (Chinnaswamy Stadium) కు కర్ణాటక ప్రభుత్వం శుభవార్త చెప్పింది. బెంగళూరులోని ప్రతిష్టాత్మక ఎం. చిన్నస్వామి స్టేడియానికి అంతర్జాతీయ మ్యాచ్‌లు, ఐపీఎల్ పోటీలు మళ్లీ నిర్వహించేందుకు అధికారిక అనుమతి లభించింది. ఈ విషయాన్ని కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం ప్రెస్ రిలీజ్ ద్వారా వెల్లడించింది. గత ఏడాది జూన్ 4న జరిగిన ట్రోఫీ వేడుకలో తొక్కిసలాట చోటు చేసుకోవడంతో 11 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఆ విషాద ఘటన తర్వాత స్టేడియంపై కఠిన ఆంక్షలు విధించారు. దాంతో విజయ్ హజారే ట్రోఫీ, మహిళల వరల్డ్ కప్ మాత్రమే కాదు, పురుషుల టీ20 వరల్డ్ కప్‌కు కూడా బెంగళూరు దూరమైంది. ప్రభుత్వం నిర్దేశించిన కఠిన నిబంధనలను పాటించిన పక్షంలోనే ఈ అనుమతి చెల్లుబాటు అవుతుందని KSCA స్పష్టం చేసింది. భద్రత, సెక్యూరిటీ, ప్రేక్షకుల నియంత్రణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి బాధ్యతతో అమలు చేస్తామని సంఘం భరోసా ఇచ్చింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>