epaper
Wednesday, March 4, 2026
epaper

భారత విద్యార్థులకు కెనడా గుడ్​న్యూస్​

కలం, వెబ్​ డెస్క్​: అసలే రకరకాల కారణాలతో అమెరికా, ఆస్ట్రేలియా, యూకే స్టూడెంట్స్​ వీసాలకు కోత వేస్తున్న వేళ.. భారత విద్యార్థులకు కెనడా(Canada) ప్రభుత్వం గుడ్​ న్యూస్​ చెప్పింది. తమ దేశానికి చదువుకోసం వచ్చే భారత విద్యార్థులకు 100 మిలియన్​ డాలర్ల విలువైన 200 స్కాలర్​షిప్​లు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. యూనివర్సిటీ ఆఫ్​ టొరంటో వీటిని స్పాన్సర్​ చేస్తుందని వెల్లడించింది. భారత విద్యార్థులకు గత ఐదేళ్లలో 700కు పైగా స్కాలర్​షిప్​లు అందించగా, ఈసారి మరింత పెంచనున్నట్లు తెలిపింది. దీనికోసం 25 మిలియన్​ డాలర్లు ఖర్చు చేయనున్నట్లు పేర్కొంది. కెనడా ప్రధాని మార్క్​ కార్నీ భారత పర్యటన ముగిసిన కాసేపటికే ఈ నిర్ణయం ప్రకటించింది.

దీంతో పాటు భారత విద్యార్థులకు, విద్యారంగానికి ఉపయోగపడే మరిన్ని ప్రయోజనాలు కల్పించనున్నట్లు కెనడా(Canada) వెల్లడించింది. రెండు దేశాల్లోని యూనివర్సిటీల మధ్య భాగస్వామ్యం; స్టడీ, ఎక్ఛేంజ్​ అవకాశాలపై పరస్పర సహకారం; భారత్​లో మూడు హైబ్రిడ్​ స్టడీ లొకేషన్స్​ ఏర్పాటు; కళలు, విజువల్​ ఆర్ట్స్​, మ్యూజిక్​, పబ్లిషింగ్ అండ్​ ఎంటర్​టైన్​మెంట్​ టెక్నాలజీ బలోపేతంపై ఒప్పందం; ఐఐటీ తిరుపతి, ఐసర్​ తిరుపతిలో డల్హౌసీ యూనివర్సిటీ ఇన్నోవేషన్​ క్యాంపస్​ ఏర్పాటు వంటివి ఇందులో ఉన్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!