epaper
Saturday, January 17, 2026
spot_img
epaper

మేడారం వెళ్లే భక్తులకు అలర్ట్.. ఇది తెలుసుకోండి

కలం, వెబ్ డెస్క్ : మేడారం (Medaram) మహాజాతర సందడి మొదలైంది. ఈ 28వ తేదీ నుంచి జాతర స్టార్ట్ అవుతున్నా.. అప్పుడే వేలాది మంది మేడారం (Medaram) వెళ్లి సమ్మక్క, సారలమ్మల దర్శనం చేసుకుంటున్నారు. అయితే రేపు జనవరి 18న, 19న మేడారం వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్ వచ్చేసింది. 18న ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి మేడారంలో పర్యటించబోతున్నారు. రేపు కేబినెట్ మీటింగ్ అక్కడే ఏర్పాటు చేశారు. కొత్తగా నిర్మించిన సమ్మక్క, సారలమ్మ గద్దెలను ఎల్లుండి సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నారు.

సీఎం పర్యటన ఉన్నందున రేపు, ఎల్లుండి మేడారంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. వరంగల్ నుంచి వచ్చే వాహనాలు ములుగు, పస్రా, నార్లాపూర్ మీదుగా మేడారానికి వెళ్లాలని పోలీసులు తెలిపారు. అలాగే తాడ్వాయి మీదుగా ఎలాంటి రాకపోకలు లేవు. మేడారం నుంచి తిరిగి వెళ్లాలి అనుకునే వారు బయ్యక్కపేట నుంచి పరకాల గుండెప్పాడ్ మీదుగా వరంగల్ హైవేకు చేరుకోవాలని పోలీసులు తెలిపారు. ఎలాంటి డౌట్ ఉన్నా మేడారం వాట్సాప్ హెల్ప్ లైన్ నెంబర్ లో తెలుసుకోవాలని సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>