epaper
Wednesday, March 4, 2026
epaper

ఏంటీ పిచ్చి.. దరిద్రమైన పని చేసిన కుర్రాళ్లపై సజ్జనార్ ఫైర్

కలం, డెస్క్ : సోషల్ మీడియా పిచ్చిలో పడి కుర్రాళ్లు రోజురోజుకూ దరిద్రంగా బిహేవ్ చేస్తున్నారు. వ్యూస్, లైక్స్ మాయలో పడి.. ఏం చేస్తున్నారో కూడా మర్చిపోతున్నారు. వాళ్లు చేసే వెర్రి చేష్టలకు సామాన్య జనాలు ఇబ్బంది పడుతున్నారు. తాజాగా నలుగురు యువకులు రెండు బైకులపై వెళ్తూ చెత్త పని చేశారు. నడి రోడ్డుపై ఇద్దరు బైక్ నడుపుతుండగా.. వెనకాల కూర్చున్న ఇద్దరు సంచుల్లో నుంచి సిమెంట్ లాంటిది నడిరోడ్డుపై పోస్తూ వస్తున్నారు. దాంతో పెద్ద ఎత్తున పొగ వ్యాపిస్తోంది. వెనకాల వచ్చే వాళ్లకు, ఎదురుగా వస్తున్న వాళ్లకు కూడా రోడ్డు కూడా కనిపించకుండా వ్యాపించేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది.

ఈ వీడియోను హైదరాబాద్ సీపీ సజ్జనార్ (Sajjanar) పోస్టు చూస్తూ ఫైర్ అయ్యారు. ‘లైక్స్, వ్యూస్ కోసం ఈ సమాజం ఎటుపోతోంది. ఫేమస్ కావడం కోసం ఏమైనా చేస్తారా. వెనకాల వచ్చే వాళ్లకు కండ్లుకనపడక యాక్సిడెంట్ అయితే వారి ప్రాణాలకు ఎవరు బాధ్యులు. రోడ్లు మీ సోషల్ మీడియా స్టంట్లకు వేదికలు కావు’ అంటూ ఫైర్ అయ్యారు సజ్జనార్ (Sajjanar). ఈ వీడియోలో ఘటన ఎక్కడ జరిగిందో క్లారిటీగా తెలియట్లేదు. బీహార్ లో జరిగిందని అందులో కనిపిస్తున్న బోర్డులను బట్టి కొందరు కామెంట్లు చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!