డీప్ ఫేక్ అంశంపై మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) స్పందించారు. దీనిని ప్రభుత్వాలు సీరియస్‌గా తీసుకోవాలని, వాటిని నియంత్రించేలా ప్రభుత్వాలు అసెంబ్లీలో చట్టాలు తీసుకురావాలని ఆయన కోరారు. డీప్ ఫేక్‌పై చట్టం తెచ్చేలా పోలీసు వ్యవస్థ ప్రయత్నాలు చేయడం అభినందనీయమని అన్నారు. సెలబ్రిటీలకు డీప్ ఫేక్‌ల బెడద తప్పని ఈ రోజుల్లో సామాన్యులకు దీని నుంచి రక్షణ కల్పించాలని ఆయన కోరారు.
యితే ఇటీవల తన ఫొటోలు, వీడియోలను ఏఐ ద్వారా తయారు చేసి, వాటిని వ్యాపారం కోసం, ప్రచారాల కోసం వినియోగిస్తున్నారని చిరంజీవి.. సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు తర్వాత.. చిరంజీవి డీప్ ఫేక్ వీడియోలను సోషల్ మీడియా నుంచి తొలగించారు. ఈ నేపథ్యంలోనే చిరంజీవి(Chiranjeevi) ఈ డీప్‌ఫేక్‌లపై స్పందించారు. అయితే సెలబ్రిటీలు డీప్ ఫేక్(Deepfake) బారిన పడటం ఇదేమీ తొలిసారి కాదు. గతంలో రష్మిక, తమన్నా సహా పలువురు బడా బడా నటీనటులు డీప్ ఫేక్ బారిన పడ్డారు.
Read Also: కాంగ్రెస్ అసమర్థత వల్ల 12 మంది చనిపోయారు: సుదర్శన్ రెడ్డి..

