ఇండియన్ క్రికెట్‌లో కోహ్లీ(Virat Kohli)కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అతడికే కాదు.. అతని జెర్సీ నెంబర్‌కు కూడా అంతే క్రేజ్ ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న అతిపెద్ద చర్చే ఇందుకు అంతకుమించిన నిదర్శనం. సౌతాఫ్రికా-ఏ టీమ్‌తో భారత్-ఏ టీమ్ ఆడే అనధికారిక మ్యాచ్‌లో స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్(Rishabh Pant).. 18వ నెంబర్ జెర్సీతో కనిపించాడు. అంతే సోషల్ మీడియాలో ఆ ఫొటో మంటలు రేపింది. జెర్సీ నెం.18 కోహ్లీది కదా.. రిషబ్ వేసుకున్నాడేంటి? రిషబ్ తన నెంబర్ మార్చుకుంటున్నాడా? ఇలా నెటిజన్స్ భారీ చర్చకే తెరలేపారు. నవంబర్ 14 నుంచి సౌతాఫ్రికాతో జరిగే టెస్ట్ సిరీస్‌లో భాగంగానే తాజాగా వార్మప్ మ్యాచ్ జరిగింది. అందులో పంత్(Rishabh Pant).. కోహ్లీ జెర్సీ నెం.18 షర్ట్‌తో కనిపించాడు.
అయితే ఇలా ఐకానిక్ నెంబర్ జెర్సీలు ధరించి ప్లేయర్స్ కనిపించడం ఇదేమీ తొలిసారి కాదు. గతంలో ఇండియన్ పేసర్ ముఖేష్ కుమార్ కూడా ఇండియా-ఏ టీమ్, ఇంగ్లండ్ లయన్స్ మధ్య జరిగిన అనధికారిక మ్యాచ్‌లో నెం.18 జెర్సీతో కనిపించాడు. దీనిపై బీసీసీఐ కూడా క్లారిటీ ఇచ్చింది. అనధికారిక మ్యాచ్‌లలో ప్లేయర్ తనకు నచ్చిన జెర్సీ నెంబర్ వేసుకోవచ్చని, కానీ అంతర్జాతీయ మ్యాచ్‌లలో మాత్రం వాళ్ల కిట్ నెంబర్ మారదని తెలిపింది. దీంతో సచిన్, ధోనీ జెర్సీ నెంబర్ల తరహాలోనే కోహ్లీ జెర్సీ నెం.18ను కూడా అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ చేయాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.
Read Also: రోహిత్ రికార్డ్.. అగ్రస్థానం సొంతం..

