మొంథా తుపాను(Cyclone Montha) దెబ్బకు ఏపీలో వ్యవసాయం, ఆక్వా, హార్టికల్చర్ సహా అనేక రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని సీఎం చంద్రబాబు(Chandrababu) వెల్లడించారు. తుపాన్ కారణంగా రాష్ట్రానికి మొత్తం రూ.5,265 కోట్ల నష్టం వాటిల్లిందని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రాథమిక అంచనాల ప్రకారం పలు రంగాలు తీవ్రమైన నష్టాన్ని చవిచూశాయని చెప్పారు.
నష్టం వివరాలు:
వ్యవసాయ రంగం: రూ.829 కోట్లు
హార్టికల్చర్ రంగం: రూ.39 కోట్లు
సెరికల్చర్ (రేశ్మా పెంపకం): రూ.65 కోట్లు
పశుసంవర్థక శాఖ: రూ.71 లక్షలు – 20 పశువులు చనిపోయాయి
ఆక్వా రంగం: రూ.1,270 కోట్లు
మున్సిపల్ శాఖ: రూ.109 కోట్లు
ఈ తుఫాన్ ప్రభావంతో పంటలు, జలవనరులు, పశువులు తీవ్రంగా దెబ్బతిన్నాయని, రైతులు, ఆక్వా రైతులకు నష్టం తీవ్రంగా ఉందని చంద్రబాబు తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికే జిల్లాలవారీగా అంచనాలు సిద్ధం చేస్తోందని, బాధితులకు సహాయం అందించేందుకు చర్యలు వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు(Chandrababu). సహజ విపత్తుల కారణంగా సంభవిస్తున్న ఈ భారీ నష్టాలను తగ్గించేందుకు శాస్త్రీయ ప్రణాళికతో వ్యవసాయ, జలవనరుల నిర్వహణ అత్యవసరమని సీఎం స్పష్టం చేశారు.
Read Also: ఏపీలో 15లక్షల ఎకరాల పంట నష్టం: జగన్

