కలం, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర కేబినెట్ (Telangana Cabinet) సమావేశాన్ని మేడారం (Medaram) లోనే నిర్వహించనున్నట్లు ప్రభుత్వం శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. ఈ నెల 18న సాయంత్రం 5 గంటలకు ఇక్కడి హరిత హోటల్ లో మీటింగ్ ఉంటుందని క్లారిటీ ఇచ్చింది.
ఈ మేరకు సీఎస్ రామకృష్ణారావు సర్క్యులర్ జారీ చేశారు. జిల్లాల పర్యటనలో భాగంగా శుక్రవారం నిర్మల్ కు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy).. శనివారం మహబూబ్ నగర్, ఆదివారం ఖమ్మం జిల్లాల్లో పర్యటిస్తారు. ఆదివారం సాయంత్రం మంత్రులతో కలిసి ములుగు జిల్లా మేడారానికి చేరుకుంటారు. అక్కడే ఆయన అధ్యక్షతన కేబినెట్ భేటీ (Telangana Cabinet) జరగనుంది. ఇలా రాష్ట్ర రాజధాని బయట ఎప్పుడూ కేబినెట్ సమావేశాలు జరిగిన దాఖలాలు లేవని, ఇదే తొలిసారి అని అధికారులు చెప్తున్నారు.
Read Also: మనిషి చావుబతుకుల్లో ఉంటే.. చేపల కోసం ఎగబడ్డరు!!
Follow Us On : WhatsApp


