కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ లోని నాచారం (Nacharam) పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. మందు గ్లాస్ కోసం అన్న ప్రాణం తీశాడు తమ్ముడు. పోలీసుల వివరాల ప్రకారం.. ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఓ బిల్డింగ్ లో మద్యం తాగారు. ఈ క్రమంలోనే మందు గ్లాస్ విషయంలో గొడవ మొదలైంది. ఇద్దరూ కొట్టుకునే దాకా వెళ్లింది. తమ్ముడు మూడో అంతస్తు నుంచి అన్నను తోసేశాడు. తీవ్ర గాయాలు కావడంతో అన్న అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని తమ్ముడిని అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


