కలం, వెబ్ డెస్క్ : పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్లలో వేలాది ఖాళీలు మిగిలిపోవడంతో నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) విడుదల చేసిన నోటీసును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. నీట్ పీజీ కోసం క్వాలిఫైంగ్ కట్ ఆఫ్ పర్సంటైల్ (NEET PG Cutoff) తగ్గించడంపై సామాజిక కార్యకర్త సోషల్ వర్కర్ హరిశరణ్ దేవ్‌గాన్, న్యూరోసర్జన్ సౌరభ్ కుమార్, యునైటెడ్ డాక్టర్స్ ఫ్రంట్ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్య మిత్తల్, వరల్డ్ మెడికల్ అసోసియేషన్ సభ్యుడు డాక్టర్ ఆకాశ్ సోని వంటి వారు ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలు చేశారు.
కాగా, నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) జారీ చేసిన నోటీసు ద్వారా నీట్ పీజీ కోసం క్వాలిఫైయింగ్ కటాఫ్ పర్సెంటైల్ ((NEET PG Cutoff)) ను భారీగా తగ్గించారు. రిజర్వ్‌డ్ కేటగిరీలు అయిన SC, ST, OBC ల కు జీరో పర్సెంటైల్ వరకు, కొన్ని సందర్భాల్లో నెగెటివ్ స్కోర్లు వచ్చినా అర్హత పొందేలా చేశారు. జనరల్, EWS కేటగిరీలకు కూడా కటాఫ్ గణనీయంగా తగ్గించింది.
ఈ నిర్ణయం సమానత్వం, జీవించే హక్కులను కాలరాయడమేనని పిటిషనర్లు తమ వాదనలో పేర్కొన్నారు. పీజీ మెడికల్ విద్యలో నాణ్యత తగ్గించడం ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా పపరిణమిల్లుతుంది. ఖాళీ సీట్లను భర్తీ చేయడమే ప్రధాన కారణంగా చూపి మెరిట్‌ను తొలగించడం, పోటీ పరీక్షను కేవలం అడ్మినిస్ట్రేటివ్ ఫార్మాలిటీగా మార్చుతున్నారు. ఇది నేషనల్ మెడికల్ కమిషన్ చట్టానికి విరుద్దం అని వాదించారు. మెరిట్ ను రద్దు చేయడం వల్ల నాణ్యత తగ్గుతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పిటిషన్ పై సుప్రీం కోర్టు త్వరలోనే విచారణ చేపట్టనుంది.


