కలం వెబ్ డెస్క్ : తెలంగాణలో ఇటీవల ఓ మంత్రి, ఐఏఎస్ అధికారిపై వచ్చిన వార్తల నేపథ్యంలో జర్నలిస్టులను (Journalists) అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్(NHRC) కేసు నమోదు చేసింది. సికింద్రాబాద్‌కు చెందిన న్యాయవాది ఇమ్మనేని రామారావు ఈ ఘటనపై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. జవవరి 15న కేసు నమోదు చేశారు. ఇప్పటికే జర్నలిస్టులకు ఈ కేసులో బెయిల్ కూడా వచ్చింది. కాగా, ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తూ తమను అరెస్ట్ చేయించిందని జర్నలిస్టులు ఆరోపించారు. అధికారులు, ప్రజా ప్రతినిధులపై నిరాధార ఆరోపణలతో కథనాలు ప్రచురిస్తే కఠినంగా వ్యవహరిస్తామని పలువురు మంత్రులు హెచ్చరించారు.
Read Also: ఇదే చివరి అవకాశం.. ఫిరాయింపులపై స్పీకర్‌కు సుప్రీం ఆదేశం
Follow Us On : WhatsApp


