కలం, స్పోర్ట్స్: బిగ్ బాష్ లీగ్ (BBL) 1వ సీజన్‌లో ఆస్ట్రేలియా క్రికెట్ కీలక నిర్ణయం తీసుకుంది. డిజిగ్రేటెడ్ బ్యాటర్ అనే కొత్త రూల్‌ను తీసుకొచ్చింది. ఈ రూల్ ప్రస్తుతం ఆస్ట్రేలియా క్రికెట్‌లో కీలక చర్చలకు దారితీస్తోంది. పలువురు సీనియర్ ప్లేయర్లు దీనిపై సానుకూలంగా స్పందిస్తున్నారు. తాజాగా దీనిపై స్పందించిన రికీ పాంటింగ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ సానుకూలంగా స్వాగతించారు. క్రికెట్ ఆస్ట్రేలియా తీసుకొచ్చిన ఈ కొత్త నియమం ప్రకారం, ప్రతి జట్టు మ్యాచ్‌కు ముందు ఒక డిజిగ్నేటెడ్ బ్యాటర్‌ను ఎంపిక చేసుకోవచ్చు.
అతడు బ్యాటింగ్ చేస్తాడు. అతని స్థానంలో మరో ఆటగాడు ఫీల్డింగ్ బాధ్యతలు చూస్తాడు. అవసరమైతే వికెట్‌కీపింగ్ కూడా చేయవచ్చు. బౌలింగ్ మాత్రం చేయలేడు. ఈ నిబంధన వయసు మీద పడుతున్న స్టార్ ఆటగాళ్లను దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చిందని రికీ పాంటింగ్ వ్యాఖ్యానించారు. క్రిస్ లిన్, మిచ్ మార్ష్ లాంటి అనుభవజ్ఞులు ఇంకా కొంతకాలం టోర్నమెంట్‌లో కొనసాగేందుకు ఇది ఉపయోగపడుతుందని చెప్పారు.
యువ ఆటగాళ్లకు పెద్ద వేదికపై అవకాశం దక్కుతుందని పాంటింగ్ తెలిపారు. ఫీల్డింగ్ సమయంలో గాయాల భయం లేకుండా బ్యాటింగ్ మాత్రమే చేయగలిగితే ట్రావిస్ హెడ్ లాంటి అంతర్జాతీయ ఆటగాళ్లు కూడా BBLలో ఆడేందుకు ముందుకు వచ్చే అవకాశం ఉందన్నారు.
గ్లెన్ మ్యాక్స్‌వెల్ కూడా ఈ మార్పుపై సానుకూలంగా స్పందించారు. యువ ఆటగాళ్లకు ఫీల్డింగ్ ద్వారా జట్టులో భాగమయ్యే అవకాశం లభిస్తే అది వారికి పెద్ద ఉత్సాహాన్ని ఇస్తుందని చెప్పారు. విక్టోరియా జట్టులో తాను ఫీల్డింగ్ చేసిన రోజులను ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ కొత్త నిబంధనను BBL 16వ సీజన్ నుంచి అమలు చేయనున్నారు. ఇది పురుషుల పోటీలకే పరిమితం. మహిళల బిగ్ బాష్ లీగ్‌లో ఈ నియమం ఉండదని క్రికెట్ ఆస్ట్రేలియా స్పష్టం చేసింది.


