కలం వెబ్ డెస్క్ : నేడు సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆదిలాబాద్(Adilabad) జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించిన బీఆర్ఎస్(BRS) నేత, మాజీ మంత్రి జోగు రామన్న(Jogu Ramanna)ను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నేడు చనాక కొరట పంపు హౌస్ ప్రారంభించేందుకు జిల్లాకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ నేతల ఆందోళనలు దృష్టిలో పెట్టుకొని పలువురు ముఖ్య నేతలను ముందస్తుగా అరెస్టులు చేస్తున్నారు.


