కలం, వెబ్ డెస్క్ : తమిళనాడు మధురై లో నిర్వహించిన జల్లికట్టులో అపశృతి (Jallikattu Mishap) చోటు చేసుకుంది. జల్లికట్టు పోటీలు సాగుతున్న గ్రామంలో ఎద్దులు ఒక్కసారిగా ప్రేక్షకులపైకి దూసుకెళ్లాయి. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న ప్రజలు పరుగులు తీశారు. ఈ ఘటనలో దాదాపు 52 మందికి పైగా గాయాలయ్యాయి. వీరిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిలో 27 మంది ఎద్దుల పోరాట యోధులు ఉన్నారు. 20 మంది ఎద్దుల యజమానులు, ఏడుగురు ప్రేక్షకులు గాయాలయ్యాయి. ఈ జల్లు కట్టు పోటీల్లో వందల సంఖ్యలో క్రీడాకారులు పాల్గొనగా.. వెయ్యికిపైగా ఎద్దులు పాల్గొన్నాయి. ప్రతి ఏటా ఈ జల్లుకట్టును తమినాడులో ఘనంగా జరుపుకుంటారు.
Read Also: విద్యార్థుల ఆత్మహత్యలు.. విద్యాసంస్థలకు సుప్రీం కీలక ఆదేశం
Follow Us On : WhatsApp


