epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

నక్సలైట్లకు మరో ఎదురుదెబ్బ.. భారీగా లొంగుబాటు

కలం, వెబ్​డెస్క్​: మావోయిస్టులకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఒక పక్క ఎన్​కౌంటర్లు, మరో పక్క లొంగుబాట్లు  కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో గురువారం భారీ స్థాయిలో నక్సలైట్లు లొంగిపోయారు (Naxalites Surrender). చత్తీస్​గఢ్​లోని బీజాపూర్​ జిల్లా పోలీసులు, సీఆర్​పీఎఫ్​ అధికారుల ఎదుట 52 మంది నక్సలైట్లు ఆయుధాలతో సహా లొంగిపోయారు. వీళ్లంతా దండకారణ్య స్పెషల్​ జోనల్​ కమిటీ (డీకేఎస్​జడ్​సీ), ఆంధ్ర–ఒడిశా బోర్డర్​ డివిజన్​ అండ్​ బ్రహ్మఘర్​ ఏరియా కమిటీ (మహారాష్ట్ర) సభ్యులు. వీళ్లలో 49 మంది మీద రూ.1.41కోట్ల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. లొంగిపోయినవాళ్లలో 21 మంది మహిళలు ఉన్నారు. నక్సలైట్ల కోసం ప్రకటించిన పూనా (పునరావాసం, జనజీవన స్రవంతి) కార్యక్రమం కింద వీళ్లందరూ లొంగిపోయినట్లు బీజాపూర్​ ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్​ వెల్లడించారు.

దేశాన్ని 2026 మార్చి 31 లోగా నక్సల్స్​ రహితంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఒక పక్క కూంబింగ్​లు, ఎన్​కౌంటర్లు జరుగుతుండగా, మరో పక్క లొంగుబాటు కార్యక్రమాలు అమలు చేస్తోంది. ఫలితంగా 2025 ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఏకంగా 1,500 మంది నక్సలైట్లు లొంగిపోయి (Naxalites Surrender), జనజీవన స్రవంతిలో కలిశారు.

Read Also: మీకు పీఎఫ్ ఉందా.. రూ.7లక్షల ఫ్రీ లైఫ్ ఇన్సూరెన్స్ గురించి తెలుసుకోండి..!

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>