epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

మొన్న రేవంత్.. నేడు చంద్రబాబు

కలం, తెలంగాణ బ్యూరో : వృద్ధాప్యంలో, అనారోగ్యంలో ఉన్న తల్లిదండ్రుల్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తే జీతంలో 10% కోత పెడతామంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) హెచ్చరించారు. దాన్ని తల్లిదండ్రులకే ప్రతి నెలా అందించేలా చట్టాన్ని తీసుకొస్తామన్నారు. ప్రభుత్వమే ఒక కుటుంబంగా మారి ప్రణాబ్ పేరుతో డే కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 12న ప్రజాభవన్‌లో జరిగిన కార్యక్రమంలో సీఎం పై వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా స్వగ్రామమైన నారావారిపల్లెకు వెళ్ళిన ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) పెద్దలను తల్చుకునే సంప్రదాయం సంక్రాంతి అని, అందుకే ఇది పెద్ద పండుగ అయిందన్నారు. “పెద్దలను మనం మర్చిపోతే మనుషులమే కాదు… జంతువులకు మనకు తేడా లేదు..” అని అన్నారు. పెద్దలను స్మరించుకుని వారికి కొత్త బట్టలు ఇచ్చే సంప్రదాయాన్ని సంక్రాంతి నేర్పిస్తే ఆ సంస్కారాన్ని మనం కొనసాగిస్తూ ఉన్నామన్నారు.

సంతోషంగా ఉంటేనే సంతృప్తి :

తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే జీతంలో కోత పెట్టడం గురించి సీఎం రేవంత్ హెచ్చరిస్తే ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం అసలు మనుషులమే కాదని వ్యాఖ్యానించారు. తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు వస్తే వాటిని పరిశీలించి కోత పెట్టిన 10% జీతాన్ని తల్లిదండ్రుల ఖాతాల్లోకి వేస్తామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ఇందుకోసం అవసరమైతే ఒక చట్టాన్ని తీసుకొస్తామన్నారు. చంద్రబాబు (Chandrababu) మాత్రం తనదైన శైలిలో… రైతులు కష్టపడి పంట పండించిన తర్వాత అది చేతికొచ్చిన సంతోషంతో జరుపుకునే పండుగే సంక్రాంతి అని అన్నారు. ఇది రైతులకు కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చిందనే సంతృప్తిని ఇస్తుందని, అందుకే సంతోషంగా ఈ పండుగను జరుపుకుంటామన్నారు. పెద్దలను విస్మరించకూడదనే భావనతోనే కొత్త బట్టలు పెట్టి వారిని గుర్తుచేసుకుంటామని, వారిని మర్చిపోతే పశువులకు, మనుషులకు తేడా ఉండదంటూ సంక్రాంతి స్పెషల్ మెసేజ్ ఇచ్చారు.

Read Also: నిర్మల్ టు యూఎస్.. వయా మేడారం.. రేపటి నుంచి సీఎం బిజీ బిజీ

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>