కలం వెబ్ డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి(Sankranti) సంబరాలు వైభవంగా జరుగుతున్నాయి. ఏపీలో సంక్రాంతి వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచే కోడి పందేలు(Cockfights) బుధవారం నుంచే ఘనంగా ప్రారంభమయ్యాయి. హైకోర్ట్ కోడి పందేలపై కఠిన ఆంక్షలు విధించినా పందెం రాయుళ్లు మాత్రం తగ్గేదేలే అన్నట్లుగా రెచ్చిపోతున్నారు. కోడి పందేల్లో లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నాయి. మరోవైపు విజేతలకు కళ్లు చెదిరే బహుమతులు అందిస్తున్నారు. పిఠాపురం(Pithapuram) నియోజకవర్గం కందరాడ గ్రామంలో జరుగుతున్న కోడి పందేళ్లో ఇస్తున్న బహుమతులు చూసి అందరూ షాకవుతున్నారు. స్థానికంగా పిల్లా శివశంకర్, మర్రి రాజు ఆధ్వర్యంలో కోడి పందేలు నిర్వహిస్తున్నారు. ఈ పందేల్లో గెలిచిన విజేతలకు రాయల్ ఎన్ఫీల్డ్(Royal Enfield), మహీంద్రా థార్(Thar) వాహనాన్ని బహుమతిగా అందిస్తున్నారు. కోడి పందేలతో పాటు ఈ వాహనాలు చూసేందుకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. ఎవరు గెలుస్తారో.. ఈ భారీ బహుమతులను ఎవరు గెలుచుకుంటారోనని ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.


