కలం, వెబ్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), విక్టరీ వెంకటేశ్ కాంబినేషన్‌లో వచ్చిన మన శంకర వర ప్రసాద్ గారు మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం నమోదు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో అన్ని కేంద్రాల్లో భారీ కలెక్షన్లు సాధిస్తోంది. నైజాంలో కొంతకాలంగా ఏ చిత్రాలు ఆశించినస్థాయిలో కలెక్షన్లు సాధించలేదు. కానీ చిరు మూవీ అత్యధిక కలెక్షన్లు సాధించే దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు రూ. 4.25 కోట్ల వసూలు చేసింది. దీనితో మొత్తం నైజాం వాటా రూ. 15.5 కోట్లు (GST మినహాయించి) రాబట్టింది. చిరంజీవి నటన హైలైట్‌గా మారింది. చిరు టైమింగ్, స్క్రీన్ ప్రెజెన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.
చిరంజీవి భార్యగా నయనతార కనిపించగా, వెంకటేష్ (గెస్ట్ రోల్), కేథరిన్ థ్రెసా, సచిన్ ఖేడేకర్, హర్షవర్ధన్, జరీనా వహాబ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మించిన ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం సమకూర్చారు. సంక్రాంతి (Sankranti) సెలవులు కావడంతో చిరంజీవి మూవీ మరిన్ని కలెక్షన్లు సాధించే అవకాశాలున్నాయి. ఇప్పటివరకు రిలీజ్ అయిన సినిమాలతో పోలిస్తే చిరు సినిమాకు మంచి వైబ్ ఉంది. ఇది భారీ కలెక్షన్లు సాధించేందుకు బూస్ట్ ఇవ్వనుంది.


