కలం వెబ్ డెస్క్ : ఆర్మీ డే(Army Day )సందర్భంగా భారత సైనికుల ధైర్యసాహసాలకు, అంకితభావాన్ని ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) అభినందించారు. ఈ సందర్భంగా ఆయన తన ఎక్స్ ఖాతాలో ప్రత్యేక వీడియోను పోస్ట్ చేస్తూ సైనికులకు శుభాకాంక్షలు తెలిపారు. దేశ రక్షణ కోసం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోనూ ఎంతో ధైర్యంతో సేవలందిస్తున్న భారత సైన్యం దేశానికే గర్వకారణమని ప్రధాని పేర్కొన్నారు. స్వార్థం లేని సేవతో దేశాన్ని కాపాడుతున్న సైనికులు ప్రజల్లో విశ్వాసం, భద్రతాభావాన్ని కలిగిస్తున్నారని మోడీ ప్రశంసించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్లను ఈ సందర్భంగా ప్రధాని స్మరించుకున్నారు. వారి త్యాగాలకు దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుందన్నారు. భారత సైన్యం చూపుతున్న నిబద్ధత ప్రతి భారతీయుడికి ప్రేరణగా నిలుస్తోందని మోడీ తన సందేశంలో స్పష్టం చేశారు.


