కలం, వెబ్ డెస్క్: డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) నాయకత్వంలో అమెరికా వలస విధానాలు సమూల మార్పులకు గురవుతున్నాయి. తాజా ఘటనలు వలస విధానాన్ని పూర్తిగా మార్చేస్తున్నాయి. అమెరికా (US Visa) 75 దేశాలకు వీసా జారీని నిలిపివేయడం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో తాజా సమాచారం ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 75 దేశాలకు వీసా ప్రాసెసింగ్ మొత్తాన్ని అమెరికా నిలిపివేసింది.
ఆ జాబితాలో భారతదేశం లేదు. కానీ అదే సమయంలో నేపాల్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇతర పొరుగు దేశాలు కూడా జాబితాలో ఉన్నాయి. మరో ఊహించని విషయం ఏమిటంటే.. ట్రంప్, పుతిన్ మధ్య కొనసాగుతున్న వివాదం దృష్ట్యా, రష్యాకు కూడా అమెరికా వీసాను(US Visa) నిలిపివేసింది. దీని ప్రకారం ఇతర దేశాల సభ్యులు తదుపరి నోటీసు వచ్చేవరకు అమెరికాలోకి ప్రవేశించలేరు.
ఈ దేశాలకు నో ఎంట్రీ
ఆఫ్ఘనిస్తాన్, అల్బేనియా, అల్జీరియా, ఆంటిగ్వా, బార్బుడా, అర్మేనియా, అజర్‌బైజాన్, బహామాస్, బంగ్లాదేశ్, బార్బడోస్, బెలారస్, బెలిజ్, భూటాన్, బోస్నియా, బ్రెజిల్, బర్మా, కంబోడియా, కామెరూన్, కేప్ వెర్డే, కొలంబియా, కోట్ డి ఐవోయిర్, క్యూబా, డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో, డొమినికా.
ఈజిప్ట్, ఎరిట్రియా, ఇథియోపియా, ఫిజి, గాంబియా, జార్జియా, ఘనా, గ్రెనడా, గ్వాటెమాల, గినియా, హైతీ, ఇరాన్, ఇరాక్, జమైకా, జోర్డాన్, కొసావో, కువైట్, కిర్గిజ్స్తాన్, లావోస్, లెబనాన్, లైబీరియా, లిబియా, మాసిడోనియా, మోల్డోవా, మంగోలియా, మోంటెనెగ్రో, మొరాకో, నేపాల్, నికరాగ్వా, నైజీరియా, పాకిస్తాన్, రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో, రష్యా, రువాండా,
సెయింట్ కిట్స్, సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్, గ్రెనడైన్స్, సెనెగల్, సియెర్రా లియోన్, సోమాలియా, దక్షిణ సూడాన్, సూడాన్, సిరియా, టాంజానియా, థాయిలాండ్, టోగో, ట్యునీషియా, ఉగాండాతో పాటు మరికొన్ని దేశాలున్నాయి.
Read Also: కోడి పందేల విజేతలకు కళ్లు చెదిరే బహుమతులు!
Follow Us On : WhatsApp


