కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ నుమాయిష్ (Numaish) వేదికగా నగర పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రజలకు రహదారి భద్రత, రక్షణ అంశాలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్స్‌ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ (CP Sajjanar), అడిషనల్ డీజీపీ చారు సిన్హాతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ మాట్లాడుతూ, హైదరాబాద్ అనగానే చార్మినార్, బిర్యానీలతో పాటు నుమాయిష్ (Numaish) కూడా నగర గుర్తింపులో ఒక భాగమన్నారు. 1938లో కేవలం పదుల సంఖ్యలో స్టాల్స్‌తో మొదలైన ఈ ప్రదర్శన, నేడు దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రదర్శనగా ఎదిగిందని గుర్తుచేశారు. 85 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ఈ వేదిక జాతీయ సమైక్యతకు, గంగా-జమునా తహజీబ్ సంస్కృతికి ప్రతీకగా నిలుస్తోందని ఆయన ప్రశంసించారు.
ప్రదర్శనకు వచ్చే లక్షలాది మంది ప్రజలకు వివిధ భద్రతా అంశాల పట్ల చైతన్యం కల్పించేందుకు ఈ స్టాల్స్ ఎంతో ఉపయోగపడతాయని అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో జాయింట్ సీపీ (ట్రాఫిక్) డి. జోయల్ డెవిస్, డీసీపీలు రాహుల్ హెగ్డే, జి. చంద్రమోహన్, వి. అరవింద్ బాబు, లావణ్య నాయక్ జాదవ్, ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు సుకేష్ రెడ్డి, కార్యదర్శి బి.ఎన్. రాజేశ్వర్, కోశాధికారి డాక్టర్ ఎన్. సంజీవ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Read Also: దడపుట్టిస్తున్న గోల్డ్ ధరలు.. పెళ్లిళ్ల సీజన్ లో తిప్పలు
Follow Us On: Sharechat


