కలం, వెబ్ డెస్క్ : మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) పై పోలీస్ కేసు నమోదు అయింది. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ నేత రవికిరణ్ దేవులపల్లి ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు చర్యల్లో భాగంగా తలసానిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
సికింద్రాబాద్ (Secunderabad) నియోజకవర్గాన్ని GHMC పునర్విభజనలో భాగంగా ముక్కలు చేస్తున్నారని, ఇదే జరిగితే రేవంత్ రెడ్డిని (Revanth Reddy) ముక్కలు చేస్తానంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు తలసాని. దీనిపై కొన్ని రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ సనత్ నగర్ ఇన్ ఛార్జ్ డాక్టర్ నీలిమ ఆదేశాల మేరకు పార్టీ నేతలు మహంకాళి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ నుంచి తీవ్ర విమర్శలు రావడంతో పాటు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
దీంతో వెనక్కి తగ్గిన తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని తెలిపారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తులకు గౌరవం ఉందని, కానీ సికింద్రాబాద్ చరిత్ర, అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి పోరాడతామని ఆయన స్పష్టం చేశారు. కాగా, ఈ వివాదంపై ఈ నెల 17న సికింద్రాబాద్ లో భారీ ర్యాలీ, బంద్ వంటి కార్యక్రమాలను బీఆర్ఎస్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
Read Also: మల్లన్న పార్టీకి ఈసీ కేటాయించిన గుర్తు ఇదే..
Follow Us On: Youtube


