నేషనల్ క్రష్ రష్మిక మందాన(Rashmika Mandanna) సెన్సేషనల్ స్టేట్మెంట్ ఇచ్చారు. తాను ఇప్పటి నుంచే పిల్లల కోసం రెడీ అవుతున్నానని చెప్పిందీ బ్యూటీ. తన లేటెస్ట్ మూవీ ‘ది గర్ల్‌ఫ్రెండ్(The Girlfriend)’ మూవీ ప్రమోషన్స్‌లో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక వర్క్‌లైఫ్ బ్యాలెన్స్, నటీనటుల పని ఒత్తిడి, భవిష్యత్తు ప్లాన్స్ గురించి పలు విషయాలు పంచుకుంది. ఈ సందర్బంగానే తాను ఇంకా తల్లిని కాలేదని చెప్పింది. ‘‘నాకు పిల్లలు పుడతారని తెలుసు. వారి కోసం ఇప్పటి నుంచే ఆలోచిస్తున్నాను. వారిని సురక్షితంగా ఉంచాలి. వారికి మంచి లైఫ్ ఇవ్వాలి. వాళ్ల కోసం నేను ఏం చేయడానికి అయినా ఫిట్‌గా ఉండాలి. 20-30 మధ్యలో కష్టపడాలి. 30-40ల్లో వర్క్, లైఫ్ బ్యాలెన్స్ చేయాలి. ఆ తర్వాత ఏమవుతుందో ఎవరికీ తెలియదు. కానీ దాన్ని కూడా ప్లాన్ చేసుకోవాలి’’ అని రష్మిక చెప్పుకొచ్చింది.

