కలం, వెబ్ డెస్క్ : బలగం సినిమా చిత్ర పరిశ్రమ దృష్టిని ఆకర్షించిన దర్శకుడు బలగం వేణు (Balagam Venu). తెలంగాణ నేపథ్యంలో ఆయన రూపొందించిన ఈ సినిమా పల్లె పల్లెనా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ప్రత్యేకంగా స్క్రీన్ ఏర్పాటు చేసుకుని ఊరంతా కలిసి సినిమాను చూడటం బలగం విషయంలో జరిగింది. ఇలాంటివి కొన్ని దశాబ్దాల క్రితం జరిగేవట. ప్రేక్షకాదరణతో పాటు పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు గెల్చుకుంది బలగం సినిమా.
ఇంత సాధించిన తర్వాత కూడా దర్శకుడు వేణు తన కొత్త సినిమాను పట్టాలెక్కించడంలో టైమ్ తీసుకున్నాడు. ఆయన గతంలో ఎల్లమ్మ అనే సినిమా (Yellamma Movie)ను అనౌన్స్ చేశాడు. పలు కారణాలతో అది సెట్స్ మీదకు వెళ్లడం ఆలస్యమవుతూ వచ్చింది. ఇప్పుడీ ప్రాజెక్ట్ అప్డేట్ ఇచ్చాడు డైరెక్టర్ వేణు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థలో ఎల్లమ్మ సినిమా నిర్మాణం కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ రేపు (ఈ నెల 15న) సాయంత్రం 4.05 నిమిషాలకు ఇవ్వబోతున్నారు. ఈ గ్లింప్స్ లో సినిమాకు సంబంధించిన డీటెయిల్స్ ఉండబోతున్నాయి.
ఈ చిత్రానికి సంబంధించి గతంలో హీరోలుగా నాని, నితిన్ పేర్లు వినిపించగా..ఇప్పుడు కొత్తగా దేవి శ్రీ ప్రసాద్ పేరు ప్రచారమవుతోంది. డైరెక్టర్ వేణు (Balagam Venu) రూపొందిస్తున్న ఎల్లమ్మ సినిమాలో రాక్ స్టార్ గా పేరున్న మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ (Devisri Prasad) హీరోగా పరిచయమవుతాడనే టాక్ వినిపిస్తోంది. దిల్ రాజు సంస్థతో దేవికి ఎంతో అనుబంధం ఉంది. ఈ రిలేషన్ నేపథ్యంలోనే ఆయన హీరోగా నటించేందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.
Read Also: సక్సెస్ పార్టీ చేసుకున్న శంకర వరప్రసాద్
Follow Us On: X(Twitter)


