కలం, వెబ్ డెస్క్ : దాదాపు నాలుగున్నర ఏళ్ల నిరీక్షణ తర్వాత ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో (ICC ODI Ranking) విరాట్ కోహ్లీ (Virat Kohli) మళ్లీ నెంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకున్నారు. తాజాగా ఐసీసీ (ICC) రిలీజ్ చేసిన జాబితాలో ఫస్ట్ ప్లేస్ లో నిలిచాడు. 2021 జులైలో చివరిసారి అగ్రస్థానంలో ఉన్న కోహ్లీ, తన అద్భుతమైన ఫామ్‌తో మరోసారి ఈ ఘనత సాధించాడు. ఇటీవల న్యూజిలాండ్‌తో వడోదరాలో జరిగిన వన్డేలో 93 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌తో రోహిత్ శర్మను వెనక్కి నెట్టి, 785 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకున్నారు. గత ఐదు వన్డేల్లో కోహ్లీ వరుసగా 74 నాటౌట్, 135, 102, 65 నాటౌట్, 93 పరుగులు సాధించాడు.
కోహ్లీ కెరీర్‌లో వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకోవడం ఇది 11వ సారి. ఇప్పటివరకు మొత్తం 825 రోజుల పాటు టాప్ పొజిషన్‌లో కొనసాగిన విరాట్, అత్యధిక కాలం నెంబర్ 1గా ఉన్న భారత బ్యాటర్‌గా చరిత్ర సృష్టించారు. విరాట్ కోహ్లీ (Virat Kohli) 785 పాయింట్లతో మొదటి స్థానంలో ఉండగా, న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిచెల్ కేవలం ఒక్క పాయింట్ తేడాతో 784 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచారు. టీమిండియా ఆటగాడు రోహిత్ శర్మ 775 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నారు.
Read Also: ఐఎన్ఎస్వీ కౌండిన్య: అజంతా గుహల నుంచి.. అరేబియా ద్వీపకల్పంలోకి
Follow Us On: Sharechat


