కలం, వెబ్ డెస్క్: ఉన్నత చదువులు, ఉపాధి అవకాశాల కోసం విదేశాలకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. కానీ అదే సమయంలో విదేశాల్లో భారతీయ విద్యార్థులు ప్రమాదాల బారిన పడుతున్నారు. తాజాగా కజకిస్తాన్‌లో (Kazakhstan) జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక భారతీయ విద్యార్థి (Indian Student) మరణించాడు. మరికొంత మంది గాయపడ్డారు.
కజకిస్తాన్‌లో (Kazakhstan) జరిగిన రోడ్డు ప్రమాదంలో మిలి మోహన్ మరణించినట్లు సమాచారం. ఆషికా షీజామిని మరియు జసీనా బి అనే ఇతర విద్యార్థులు గాయపడినట్టు భారత రాయబార కార్యాలయం తెలిపింది. సెమెయ్ మెడికల్ యూనివర్సిటీకి చెందిన 11 మంది విద్యార్థులు టూర్‌కు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. భారతీయ విద్యార్థులు వరుసగా ప్రమాదాల బారిన పడుతుండటంతో తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది.
Read Also: రాహుల్ హామీ బేఖాతర్.. నల్లగొండలో ‘రెడ్డి’లదే పెత్తనం!!
Follow Us On : WhatsApp


