epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

దారుణం.. వీధి కుక్కలపై విష ప్రయోగం, 600 కుక్కలు మృతి

కలం, వెబ్​ డెస్క్​: రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలో కుక్కకాటు కేసులు పెరిగిపోతున్నాయి. పిల్లల నుంచి పెద్దల వరకు కరిచేస్తూ రెచ్చిపోతున్నాయి. ఈ సమస్యకు కొందరు ఇతర మార్గాలతో చెక్​ పెడుతుంటే, మరికొందరు విష ప్రయోగం చేస్తూ వీధి కుక్కలను (Stray Dogs) చంపేస్తున్నారు. కొత్త వ్యాధితో వీధి కుక్కులు బాధపడుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. దీంతో పలు చోట్ల గ్రామపంచాయతీలు కుక్కల ఏరివేతకు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కామారెడ్డి (Kamareddy) జిల్లా మాచారెడ్డి పరిధిలో దారుణం చోటుచేసుకుంది.

భవానీపేట, ఫరీద్‌పేట, వాడి, పాల్వంచ, బండరామేశ్వర్ పల్లిలో సర్పంచ్‌ల ఘాతుకానికి పాల్పడ్డారు. ఈ గ్రామాల్లో వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉండటంతో విష ప్రయోగం చేశారు. మొత్తం 600 కుక్కలు చనిపోయినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై స్ట్రే ఆనిమల్ ఫౌండేషన్ ప్రతినిధుల ఫిర్యాదు చేశారు. ఐదుగురు సర్పంచ్‌లపై మాచారెడ్డి పీఎస్‌లో కేసు నమోదైంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>